మనిషి అపరిమిత శక్తులతో పుట్టించబడ్డాడు.
అయినప్పటికీ ఈ ప్రస్తుత ప్రపంచంలో తన శక్తిని అతి తక్కువగా మాత్రమే వినియోగించుకుంటున్నాడు. మనిషి నైజం ప్రకారం తాను శాశ్వతంగా జీవించాలని భావిస్తాడు. కాని అతి త్వరలోనే తన ప్రమేయం లేకుండా మరణం సంభవించి, అతని జీవితాన్ని ముగించేస్తుంది. మనిషి మదిలో సముద్రమంత కోరికలు నిండి ఉంటాయి. కాని అవి ఎన్నడూ పరిపూర్తికావు. మనిషి తన మదిలో కలల కట్టడాన్ని నిర్మించుకుంటాడు. కాని అవి ఎప్పుడూ సాకారం చెందవు. ఈ సందర్భంగా ఒక పేదవానికి మరియు ఒక ధనవంతునికి ఏవిధమైన వ్యత్యాసం కూడా లేదు. ఎందుకు ఈ ప్రస్తుత ప్రపంచానికి మరియు మనిషికి పొంతన కుదరటం లేదు?
Reviews
There are no reviews yet.