ఇస్లాం మరియు సుల్తాన్ అనే పుస్తకంలో, రచయిత మౌలానా వహీదుద్దీన్ ఖాన్ ఇస్లాంకు ఉన్న రెండు ఆవశ్యకతలను వివరించారు. అంతర్గతంగా ప్రతి స్త్రీ పురుషుడు భగవంతుడి భక్తితో కూడిన జీవితాన్ని అనుసరించాలి. మరోమాటలో చెప్పాలంటే, ప్రతి ఒక్కరూ నిజమైన విశ్వాసులుగా మారడానికి కృషిచేయాలి. బాహ్యంగా, దివ్య సందేశాన్ని మానవాళి వరకు శాంతియుతంగా చేరవేసే సందేశకార్యము విశ్వాసుల లక్ష్యం అయ్యుండాలి. ఈ విషయంలో రాజకీయ అధికారం యొక్క అసలు పాత్ర న్యాయాన్ని అమలు చేయడం కాదు, దాని అసలు పాత్ర సాధారణ పరిస్థితిని నెలకొల్పడం. అంటే సమాజంలో శాంతిని నెలకొల్పడం, ప్రజలు తమకు అనుకూలమైన పరిస్థితుల్లో న్యాయాన్ని అనుసరించే అవకాశాన్ని కల్పించడం. అందువల్లనే ఇస్లామీయ పండితులందరూ శాంతిసంరక్షణల వ్యవహారంలో సన్మార్గములైన నలుగురు ఖలీఫాల విధానానికి భిన్నంగా ఉన్నప్పటికీ కూడా వంశపారంపర్య రాజకీయ నమూనాను అంగీకరించారు. దేశపౌరులకు శాంతి భద్రతలను తగు రీతిలో అందించినంత కాలం ఏ విధమైన రాజకీయ పాలననైనా సరే ఇస్లాంలో ఆమోదయోగ్యమైనదే. సమాజంలో శాంతి నెలకొని ఉన్నంతకాలం ఏ విధంగానైతే ప్రవక్తలందరూ సందేశకార్యాన్ని విశ్వవ్యాప్తంగా శాంతియుత రీతిలో నిర్వహించారో ఆ విధంగానే వ్యక్తులు లేదా సంస్థలు సందేశకార్యన్ని నిర్వర్తించగలరు.
Islam Aur Sultan
Islam Aur Sultan
₹0.00
ఇస్లాం మరియు సుల్తాన్ అనే పుస్తకంలో, రచయిత మౌలానా వహీదుద్దీన్ ఖాన్ ఇస్లాంకు ఉన్న రెండు ఆవశ్యకతలను వివరించారు. అంతర్గతంగా ప్రతి స్త్రీ పురుషుడు భగవంతుడి భక్తితో కూడిన జీవితాన్ని అనుసరించాలి.
Reviews
There are no reviews yet.