సీపీఎస్ తెలుగు గురించి
మౌలానా వహీదుద్దీన్ ఖాన్ గారు, ఇస్లాం ధర్మానికి వాస్తవ మూలమైన ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ వారి జీవనవిధానమైన సున్నత్‌తో పాటు సమకాలీన అంశాలపై కూడా అధ్యయనం చేయటానికి తన జీవితాన్నే అంకితం చేసేశారు. శాస్త్రీయ ఇస్లామీయ అధ్యయనం మరియు ఆధునిక విజ్ఞానశాస్త్రాల పరిశోధనలు మౌలానా వారిని ఇస్లామీయ బోధనలను రాబోయే శాస్త్రీయ యుగపు శైలి మరియు పరిభాషలో ప్రజలముందు పెట్టవలసిన సమయం ఆసన్నమైందనే వాస్తవాన్ని గ్రహించేలా చేశాయి. అప్పటినుండి మౌలానాగారు ఇస్లాంను ఆధునిక భాషలో చెప్పటం ప్రారంభించారు. సత్యాన్వేషకుల ఆలోచనలతో సంభాషిస్తూ, ఏకేశ్వరోపాసనా సిద్ధాంతాన్ని, మరణానంతర జీవిత వాస్తవికతను మరియు దేవుని సృష్టి ప్రణాళికను శాస్త్రీయ వాదనల ఆధారంగా మౌలానాగారు ప్రజలముందు ఉంచుతున్నారు. ఇస్లాంపైవున్న అపోహలను దూరం చేస్తూ, కేవలం శాంతి, ఆధ్యాత్మికతల ఆధారంగా ఇస్లాం వాస్తవ స్వరూపాన్ని ప్రజలకు చూపిస్తున్నారు. వ్యక్తులు అనుకూల మార్గాలపై నడవటానికి వారి ఆలోచనలను సరిచేయటం కోసం, శాంతియుత ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని వ్యాపింపచేయటం కోసం మరియు మత సామరస్య వేదికలను ఏర్పాటు చేయటం కోసం, మౌలానాగారు CPS-International (శాంతి మరియు ఆధ్యాత్మికతల అంతర్జాతీయ కేంద్రం) అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు.
సానుకూలంగా ఆలోచించడం మరియు ప్రపంచంలో శాంతి కోసం కృషి చేయడమే దైవాన్ని చేరే మార్గం
తెలుగు ఖురాన్
పవిత్ర ఖురాన్ తెలుగు అనువాదం – చదవడానికి సులభం, ఎక్కడైనా మీ ఫోన్‌లో.